రష్యాలో పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు

మనకంటే అలవాటే గానీ రష్యాలో ఇలాంటి ప్రమాదం ఇదే మొదలు... అందుకే అక్కడి అధికారులు కూడా షాకైపోయారు. రోడ్డుపై వెళుతున్న బస్సు పాదచారులపైకి దూసుకె ళ్లింది. దాంతో ఐదుగురు చనిపోయినట్లు ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు. వెస్ట్రన్‌ మాస్కోలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞాన లోపం, ఇంకా యితర కారణాలు ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై వెళుతున్న బస్సు ఒక్కసారిగా అండర్‌ పాస్‌ మెట్ల మీదుగా పాదచారులపైకి వెళ్లింది. మేం షాకయ్యాం. అని పోలీసు అధికార ప్రతినిధి చెప్పారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Facebook
Twitter