రాజకీయాల్లోకి వస్తే.. గెలిచినట్లే - రజనీకాంత్


"దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తాను. రాజకీయ రంగప్రవేశం విషయంలో నేను తీసుకునే నిర్ణయం ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుంది అనేది బాగా ఆలోచించాలి. నాకు రాజకీయాలు కొత్తేం కాదు. కాకపోతే ఆలస్యమైందంతే. రాజకీయాల్లోకి రావడం అంటూ జరిగితే విజయం సాధించేసినట్లే. ఏ విషయం డిసెంబర్‌ 31న ప్రకటిస్తాను." అని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. మంగళవారం చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. డిసెంబర్‌ 31వరకు వారం రోజుల పాటు అభిమానులతో అయన సమావేశం కానున్నారు. 18 జిల్లాలకు చెందిన వెయ్యి మంది అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రజనీ రాజకీయ రంగ ప్రవేశం పై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై డిసెంబర్‌ 31న తానే స్వయంగా ప్రకటిస్తానని రజనీ తెలిపారు. ‘యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందాం. మిమ్మల్ని మళ్లీ కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. అన్నారాయన.

ముఖ్యాంశాలు