గుజరాత్ సీఎంగా విజయ్ రూపాని ప్రమాణం

గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మరో 20 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లీ వీరిచే ప్రమాణం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ, రామ్ విలాస్ పాస్వన్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, నితీశ్ కుమార్, వసుంధరా రాజే, రమణ్‌సింగ్, గుజరాత్ మాజీ సీఎంలు ఆనందిబెన్ పటేల్, కేశుభాయ్ పటేల్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గుజరాత్ సీఎంగా రూపానీ బాధ్యతలు చేపట్టడం రెండోసారి. 2016లో అప్పటి ఆనందిబెన్ పటేల్ రాజీనామా అనంతరం అయన సీఎం అయ్యారు. అయన నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో గుజరాత్ లో భాజపా మరోసారి గెలిచింది.