2018లో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌


బ్రిటన్‌, ఫ్రాన్స్‌ లాంటి అగ్ర దేశాలను కూడా అధిగమించి భారత్‌ 2018 చివరి నాటికి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరిస్తుందని ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థపై సెంటర్‌ ఫర్‌ ఎకానమిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రీసర్చ్‌(సెబర్‌) కన్సల్టెన్సీ రూపొందించిన నివేదిక ఈ వ్యాఖ్యలు చేసింది. దీని ప్రకారం.. ‘డాలర్‌ పరంగా 2018లో భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఎదుగుతుంది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాలను అధిగమించి ఈ ఘనత సాధి స్తుంది. వచ్చే 15ఏళ్ల వరకు ఆర్థిక వ్యవస్థలో ఆసియా దేశాలే టాప్‌ 10లో ఉంటాయి’ అని సెబర్‌ డిప్యూటీ ఛైర్మన్‌ డాగ్లస్‌ మెక్‌విలియమ్స్‌ అన్నారు. ప్రస్తుతం భారత్‌లో పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ లాంటి భారీ ఆర్థిక సంస్కరణల వలన తాత్కాలికంగా ఆర్థిక పురోగతి నెమ్మదించిందని, త్వరలోనే మళ్లీ పుంజుకుంటుందని మెక్‌విలియమ్స్‌ పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు