నీటి పన్ను పెంచిన కేజ్రీవాల్ సర్కార్


ఢిల్లీ నగరవాసులకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. నీటికొరతతో సతమతం అవుతున్న నగర ప్రజలకు ఇప్పుడు పన్ను బెంగ తోడైంది. నీటి వినియోగంపై పన్నులు పెంపు నిర్ణయానికి జల్‌బోర్డు ప్రతిపాదనకు కేజ్రీ సర్కార్ ఆమోదం తెలిపింది. నీటి వినియోగంపై భారీగా పన్నును విధిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2018 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. అయితే, ఇకపై ఇంటికి నెలకు 20వేల లీటర్ల వినియోగ పరిమితి మించితే బాదుడే! ఉచితంగా సరఫరా చేస్తున్న 20వేల లీటర్ల పరిమితి దాటితే 20శాతం పన్నుచెల్లించాలి. నెలకు 20,000 లీటర్ల వినియోగం టారిఫ్‌లో ఎటువంటి మార్పు ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పరిమితికి మించి ఒక్క లీటర్‌ వినియోగం పెరిగినా మొత్తం వాడకంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యాంశాలు