జపాన్, రష్యాలకు బాహుబలి ది కంక్లూజన్


2017 బ్లాక్‌ బస్టర్‌ హిట్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన విషయం విదితమే. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్‌, రానా, అనుష్క తదితర నటుల అంకితభావం, సాంకేతిక నిపుణుల పనితనం ఈ చిత్రాన్ని శిఖరాగ్రాన నిలిపాయి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఇప్పటికే విడుదలై కేసులను కురిపించింది. ఇప్పుడిక ఓవర్సీస్ వంతు. త్వరలో జపాన్‌, రష్యాల్లో బాహుబలి విడుదలకానుంది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ రష్యన్‌ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. డిసెంబరు 29న జపాన్‌లో ‘బాహుబలి2’ విడుదలవుంటుంది. జనవరిలో రష్యాలో విడుదలవుతుంది. రష్యన్‌ ట్రైలర్‌ను నిర్మాత శోభు యార్లగడ్డ ట్విటర్‌ లో పోస్ట్ చేసారు. గత ఏప్రిల్‌ 28న విడుదలైన బాహుబలి కంక్లూజన్ బాక్సాఫీస్‌ వద్ద రూ.1500 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం