EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

జాదవ్ తల్లిని, భార్యను అవమానించిన పాక్

భారతీయ సంప్రదాయాన్ని పాక్ అధికారులు నిర్లజ్జగా అవమానించారు. అసహాయ మహిళలను  అమానుషంగా అవమానించారు. పాకిస్థాన్ జైలు అధికారులు ఎంత దుర్మార్గులో ఈ ఘటనతో ప్రపంచానికి అర్థం కావాలి. పాకిస్థాన్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న కులభూషణ్‌ జాదవ్‌ను చూసేందుకు వెళ్లినప్పుడు ఆయన తల్లి, భార్యను వారు తీవ్రంగా అవమానించారు. సభ్యత కూడా పాటించకుండా అమానుషంగా వ్యవహరించారు. భద్రత పేరుతో వారి మంగళ సూత్రం, గాజులు, ఆఖరికి బొట్టు కూడా తీయించేసారు. ఆలా చేస్తే గానీ ఖైదీ వద్దకు పంపేది లేదనడంతో పాపం వారు నిస్సహాయంగా ఆ పని చేయాల్సి వచ్చింది. ఇంతా చేసినా గాజుతెర వెనుకనుంచి జాదవ్ ను చూపించారు. చివరకు వారి మాతృభాషలో కూడా జాదవ్ తో మాట్లాడనీయలేదు. జాదవ్‌ తల్లి పలుమార్లు తన భాషలో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ పాక్‌ అధికారులు అడ్డుకున్నారు. ఈ వివరాలను భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రెండేళ్లుగా పాక్‌ జైలులో కులభూషణ్‌ జాదవ్‌ శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గూఢచర్యం పేరిట పాక్‌ అక్రమంగా అరెస్టు చేసి ఆయనకు ఉరి శిక్ష విధించింది. దీనిపై భారత్ అంతర్జాతీయ కోర్టు ద్వారా స్తే తేవడంతో ఉరి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జాదవ్ ను కలిసేందుకు భార్య, తల్లి ఓ భారత డిప్యూటీ హైకమిషనర్‌ పాక్ వెళ్లారు. అయితే డిప్యూటీ హై కమిషనర్‌కు చెప్పకుండానే జాదవ్‌ వద్దకు తల్లిని, భార్యను తీసుకెళ్లిన పాక్‌ అధికారులు ఆ తర్వాత మాత్రమే డిప్యూటీ హైకమిషనర్‌ను అనుమతించారు. అప్పటికీ ఆయనను జాదవ్‌ను కలవనివ్వలేదు. హైకమిషన్‌ వివరాల ప్రకారం పాక్‌ అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా వ్యవహరించలేదు. బాధిత మహిళలను పూర్తిగా అగౌరవ పరిచిందని, నామమాత్రంగా వారిని జాదవ్‌తో భేటీకి అనుమతించి ఒప్పందాన్ని తుంగలో తొక్కిందని స్పష్టం చేసింది. 

Facebook