బాలయ్య వంద అడుగుల కటౌట్


నందమూరి బాలకృష్ణ అభిమానులు అయన తాజా చిత్రం కథానాయకుడు (ఎన్ టి ఆర్ బయోపిక్) ను పురస్కరించుకొని నిజాం పేటలో వంద అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో బాలయ్య ఎన్టీఆర్‌ గెటప్లో ఉన్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ ‘యన్‌.టి.ఆర్‌’ లో బాలకృష్ణ నటిస్తుండగా క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్‌.బి.కె ఫిల్మ్స్‌ పతాకంపై బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం సంస్థ సమర్పిస్తోంది. బసవతారకంగా విద్యా బాలన్‌, చంద్ర బాబుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, హరికృష్ణగా కల్యాణ్‌రామ్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రేలంగిగా బ్రహ్మానందం, నాగిరెడ్డిగా ప్రకాశ్‌రాజ్‌, షావుకారు జానకిగా షాలినీ పాండే, సావిత్రిగా నిత్యా మేనన్, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌రాజ్‌పుత్‌ కనిపించనున్నారు. ఈ బయోపిక్‌ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. మొదటి భాగం ‘కథానాయకుడు’ను జనవరి 9న, రెండో భాగం ‘మహానాయకుడు’ను ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం