ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు క్రిష్ కి!


బ్రహ్మ తేజ ప్రొడక్షన్స్‌ పతాకంపై నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. రామకృష్ణ స్టూడియోలో ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతల్ని తాను వహించలేనని, ‘సినిమాకు న్యాయం చేయలేను’ అని ప్రముఖ దర్శకుడు తేజ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడిక ఈ దర్శకత్వ బాధ్యతల్ని క్రిష్‌ కి అప్పగించామని బాలకృష్ణ ప్రకటించారు. ‘నాటి రామకథను ఆ రాముడి బిడ్డలైన లవకుశులు చెప్పారు. నేటి రామకథను ఈ రాముడి బిడ్డలమైన మేము చెప్తున్నాం. చేసే ప్రతి పనిలో ప్రాణముంటుంది.. ప్రతి ప్రాణానికీ ఒక కథ ఉంటుంది.. ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది’. అన్నాడాయన. నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది. మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది..’ అంటూ బాలకృష్ణ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us