నౌహీరా షేక్‌ మోసాలపై ఫిర్యాదు


సులభ వాయిదాల్లో బంగారు, వజ్రాభరణాలు అంటూ లక్షల మంది మదుపరులను మోసగించిన నౌహీరా షేక్‌ తన చైన్ దుకాణాలు హీరా టెక్స్‌టైల్స్‌ పేరుతోనూ మోసాలకు పాల్పడింది. దుబాయ్‌కి చెందిన ముజీబ్‌ అబ్దుల్‌ రహమాన్‌ రెండు రోజుల క్రితం దీనిపై

సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది. సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దుబాయ్‌, హైదరాబాద్‌లో నివాసముంటున్న వారు హీరా టెక్స్‌టైల్స్‌ ప్రచారాన్ని నమ్మి రూ.15 కోట్ల విలువైన యూనిట్లను కొనుగోలు చేశారని, కొందరికి మినహా సభ్యులెవరికీ అసలు, వడ్డీ ఇవ్వలేదని గుర్తించారు. హీరా టెక్స్‌టైల్స్‌ లిమిటెడ్‌ పేరుతో వస్త్ర శ్రేణుల దుకాణాలను నౌహీరా షేక్‌ ఐదేళ్ల క్రితం ప్రారంభించింది. రూ.5లక్షల మూలధనంతోఈ వ్యాపారం ఆరంభించినట్లు కంపెనీస్‌ ఆఫ్‌ రిజిస్ట్రార్‌కు తెలిపింది. హీరా టెక్స్‌టైల్స్‌లో పెట్టుబడులు పెడితే 14 నెలలకే ఆదాయం సహా అసలు కూడా చెల్లిస్తామని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీన్ని నమ్మిన దుబాయ్‌, హైదరాబాద్‌ వాసులు రెండేళ్ల క్రితం వందల యూనిట్లు కొనుగోలు చేశారు. 2018 మే నుంచి చెల్లింపులు ఆగిపోయాయని బాధితులు పేర్కొన్నారు.

.

ముఖ్యాంశాలు