బీజేపీతో రాజ్యాంగానికి ప్రమాదం


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని, సమాఖ్య వ్యవస్థను, ప్రజా స్వామ్యాన్నిఆ ప్రభుత్వం నాశనం చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శినారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ 92వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపీ డి.రాజా, పార్టీ నేతలు మంగళవారం ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో జెండా ఎగరేశారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల విషయాల్లో గవర్నర్లు కల్పించుకుంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ పై పోరుకు ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలన్నారు.

ముఖ్యాంశాలు