పటేదార్లకు పెద్దపీట


పటేదార్ల ఉద్యమం, ఎన్నికలపై దాని ప్రభావం ఇపుడు గుజరాత్ మంత్రివర్గ కూర్పుపైనా కనిపించింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పటేదార్‌ వర్గీయులనుంచి బీజేపీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది.. అయినప్పటికీ చాతుర్యంతో ఆ పార్టీ గెలుపు సాధించినా మెజారిటీ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంది. పటేదార్లకు రిజర్వేషన్‌ హామీతో కాంగ్రెస్ ఆ వర్గాన్ని ఆకర్షించడం బీజేపీకి ప్రతికూలంగా మారింది. కౌంటింగ్‌ సమయంలో పటేదార్లు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో బిజెపికి అతి తక్కువ మెజారిటీలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల ఓటమి కూడా ఎదురైంది. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా మంత్రివర్గంలో పటేదార్లకు ప్రాముఖ్యత ఇచ్చారు. సీఎం విజయ్‌రూపానీ నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన క్యాబినెట్లో ఇప్పుడు ఇరవై మంది మంత్రులుండగా వారిలో ఆరుగురు పాటేదార్లు కావడం, వారినుంచి ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ (ఈయన గత క్యాబినెట్ లో కూడా ఇదే పదవిలో ఉన్నారు) కూడా ఉండడం విశేషం. కౌశిక్‌ పటేల్‌, సౌరభ్‌ పటేల్‌, ప్రభాత్‌ పటేల్‌, ఈశ్వర్‌ పటేల్‌, రచ్చండ భాయ్‌ పటేల్‌ మంత్రివర్గంలో ఉన్నారు. బ్రాహ్మణ సామజిక వర్గం నుంచి విభావరిబెన్‌ దేవ్‌ మంత్రి పదవి దక్కించుకున్నారు. క్యాబినెట్ లో ఏకైక మహిళా కూడా ఈవిడే. రూపానీ కేబినెట్‌లో ఐదుగురు ఓబీసీలు, ఎస్టీ, ఎస్సీ,క్షత్రియ వర్గానికి మూడేసి చొప్పున పదవులు దక్కాయి.

ముఖ్యాంశాలు