అతి చేస్తే ఇంతే! పాక్ కి స్ట్రాంగ్ వార్నింగ్


అతి చేస్తే పాకిస్ధాన్‌కు హద్దు దాటి మరీ బుద్ధి చెబుతామని భారత ఆర్మీ హెచ్చరించింది. ఎంత చేస్తే అంతకు రెట్టింపు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. భారత్‌ సేనలు సోమవారం ఉదయం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోకి దూసుకెళ్లి పాక్‌ ఆర్మీ జవాన్లను కాల్చిపడేసిన నేపథ్యంలో మేజర్‌ జనరల్‌ (మాజీ) నరేశ్‌ బదానీ స్పందిస్తూ భారత సైనికుల ఈ తాజా చర్య కూడా సర్జికల్‌ స్ట్రైక్‌ లాంటిదేనని అన్నారు. అయితే ఇది పరిమిత స్థాయి సర్జికల్‌ దాడి అని చెప్పారు. తొలుత పాక్‌ అక్రమంగా భారత సైనికులను కాల్చి చంపిందని అందుకు ప్రతిగా భారత ఆర్మీ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోకి వెళ్లి ప్రతీకారం తీర్చుకుందని చెప్పారు. పాక్‌ తన హద్దుల్లో ఉండాలని.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని అన్నారు. లేకుంటే ఆలోచించేలోపే భారత్‌ ఎదురు దెబ్బకొడుతుందని హెచ్చరించారు.

ముఖ్యాంశాలు