జగన్ నిర్ణయానికి సర్వత్రా సానుకూలత

వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి కనబరచిన రాజకీయ పరిణతిపై పార్టీ శ్రేణుల్లోనే కాకుండా రాజకీయ పరిశీలకుల్లో కూడా సానుకూలత వ్యక్తం అవుతోంది. జనవరిలో జరగనున్న కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు తన పార్టీని దూరంగా ఉంచాలని జగన్ ఒక విధంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. పోటీకి ఉత్సాహం చూపిన ఒకరిద్దరికి ఇది నచ్చకపోయినా కూడా మెజారిటీ పార్టీ శ్రేణుల్లో దీనికి ఆమోదం లభించింది. గత ఎన్నికల్లో వైసీపీకి సాంకేతికంగా మెజారిటీ ఉన్నప్పటికీ కూడా అప్పట్లో వలసల కారణంగా ఆ పార్టీ ఓడిపోయింది. అయితే నాడు గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి అనూహ్యంగా టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. పార్టీలో చేరేముందు టీడీపీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రావాలని జగన్ షరతు పెట్టగా అందుకు శిల్పా అంగీకరించి రాజీనామా చేశారు. ఫిరాయింపు రాజకీయాలపై విమర్శలు వస్తున్న సమయంలో, అందులోను ఈ అంశంపై తెదేపాపై జగన్ జాతీయ స్థాయిలో పోరాడుతున్నందునా ఈ నిర్ణయం నైతికంగా ఆ పార్టీని గౌరవప్రద స్థానంలో నిలిపింది. రాజకీయాల్లో నైతిక విలువలను కాపాడే చర్యలా దీనిని ప్రత్యర్థులు కూడా అంగీకరించారు. అయితే ఇపుడు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయాలని జిల్లాకు చెందిన ఒకరిద్దరు నేతలు జగన్‌ను కలసి ఆసక్తిని తెలిపారు. కానీ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదనేది పార్టీకి ఇప్పుడు రేఖామాత్రంగా తెలిసిన సంగతే. అందులోనూ సొంత ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు క్యాంపులకు తరలించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ చూపే ప్రలోభాలనుంచి సొంత పార్టీ ప్రజాప్రతినిధులను రక్షించుకోవడం కష్టమేనని జగన్ గ్రహించడం ఆయన పరిణతికి నిదర్శనం. అందుకే పోటీకి దిగరాదని జగన్ నిర్ణయం తీసుకున్నారు.  బలం లేని చోట పోటీ చేయకూడదని తానే మొదటి నుంచీ చెబుతున్నందున, ఇప్పుడు అందుకు భిన్నంగా నిర్ణయిస్తే తన నైతిక సిద్ధాంతంపై విమర్శలు వచ్చే ప్రమాదాన్ని కూడా జగన్ గమనించారు. ఇపుడు ఒత్తిళ్లకు లొంగి అభ్యర్థిని ప్రకటించినా గెలుపు దాదాపు అసాధ్యమే అయినా దృష్ట్యా ఆ తర్వాత ఆ ప్రభావం పార్టీ కార్యకర్తల స్థైరాన్ని దెబ్బతీస్తుందని ఆయన శంకించి ఉండవచ్చు. తన చిన్నాన్న వివేకానందరెడ్డి కడప ఎమ్మెల్సీ పోటీకి దిగి ఓడినప్పటి నుంచి, ఇటీవలి నంద్యాల ఉప ఎన్నిక వరకూ పార్టీని వరుస ఓటములు వేధిస్తున్నాయి. ఇప్పుడిక కర్నూలు ఎమ్మెల్సీ ఓటమి కూడా తోడయితే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నీరుగారి ప్రమాదం లేకపోలేదు. పార్టీలోకి రావాలనుకునే వారికి ఈ పరిస్థితి అడ్డంకిగా మారుతుంది. నిజానికి నాడు నంద్యాల ఎన్నికలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుని ఉంటే బాగుండి ఉండేదని సీనియర్లు ఇప్పుడు భావిస్తుండడం గమనార్హం. కర్నూలులో పోటీకి నిలబెట్టకపోతే వచ్చిన ప్రమాదమేమీ లేదు. మాకు మెజారిటీ లేనందున నిలబెట్టలేదన్న విషయం అందరికీ అర్థం అవుతోంది. టీడీపీ వాళ్లు చెబుతున్నట్లు మేమేమీ పారిపోలేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి నైతిక సంప్రదాయం పాటించిన పార్టీ మాది. మమ్మల్ని విమర్శిస్తే జనం నమ్మరు. అని ఓ సీనియర్ నేత