"సెక్యులర్" పదం ఎందుకు అనవసరం అంటే...

1. ప్రాథమిక నిర్వచనం కోణం లో చూస్తే  సెక్యులర్ అన్న పదం పశ్చిమ దేశాలకు చెందినది. అక్కడ చర్చి రాజ్య వ్యవస్థలో జోక్యం చేసికొంటుంటే దానికి వ్యతిరేకంగా సెక్యులర్ అన్న పదం వచ్చింది. మన దేశంలో చర్చి లేదు, మత అధిపతులు లేదు, అసలు మెజారిటీ ప్రజలకు ధర్మమే కానీ మతమే లేదు, వారిని కలిపివుంచే మత ఆచార నాయకులు కూడా లేరు, మత పెద్దలూ లేరు! అటువంటప్పుడు ఇక జోక్యం ఎక్కడిది? కాబట్టి ప్రాథమిక నిర్వచనం కోణంలో సెక్యులర్ అన్న పదం ఉండటంలో అర్థం లేదు

2. సెక్యులర్ అనే పదం చేర్చక ముందు పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఆలోచిస్తే.. సెక్యులర్ అనే పదం 1975 లలో చేర్చబడ్డది. అంతకు ముందు కూడా దేశంలో అన్ని మతాలు గౌరవింపబడ్డాయి. అంతకు ముందు కూడా మెజారిటీ ప్రజలు అయోధ్యలో రామాలయాన్ని కట్టుకోలేకపోయారు. కాబట్టి ఇది ప్రత్యేకంగా మైనారిటీలకు అదనపు రక్షణ ఇస్తుంది అనటంలో అర్థం లేదు. ఈ పదం చేర్చటం వలన ఒరిగింది కూడా  ఏమీ లేదు. అంతకుముందు భారత్ సెక్యులర్ కాదా అంటే అదేమీ కాదు. కాబట్టి ఈ కోణం లో కూడా సెక్యులర్ అన్న పదం ఉండటంలో అర్థం లేదు. 

3. సెక్యులర్ అనే పదం చేర్చాక ఏవైనా పరిస్థితులు మారాయా అనే కోణంలో చూస్తే... ఆతర్వాతే కాశ్మీరీ   హిందువులుగెంటివేత ,  ఆతర్వాతే మతం మారిన వారికి రిజర్వేషన్లు ఆలోచన . మత ఘర్షణలూ జరిగాయి. మతతత్వ అని గొంతు చించుకొని బీజేపీ అధికారం లోకి వచ్చింది . ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఈ భావజాల మద్దతుదారులే వున్నారు. అందుచేత ఈ కోణంలో చూసినా సెక్యులర్ అన్న పదం ఉండటంలో సహేతుకత లేదు
4. రాజ్యాంగ మౌలిక నిర్మాణం కోణంలో పరిశీలిస్తే.. 1960 లలో కేశవానంద భారతి కేసు లో అతున్నత న్యాయస్థానం (సుప్రీమ్ కోర్ట్) అతి స్పష్టంగా తీర్పు ఇచ్చింది . భారత రాజ్యాంగ మౌలిక స్ట్రక్చర్ ను మార్చే అధికారం పార్లమెంట్ కు లేదని ఆ తీర్పు పేర్కొంది. రాజ్యాంగం లో అత్యంత మౌలిక భాగం preamble (రాజ్యాంగ ప్రవేశిక తెలుగులో ?). దీనిని మార్చరాదు . 1975 కు ముందు preamble ప్రకారం మనది సర్వ సత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం గా నిర్వచించబడింది . దీనిని మార్చకూడదు. అప్పటికి  preamble లో సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు లేవు. preamble మార్పు చెల్లదు. సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు చేర్చటం చెల్లదు కాబట్టి ఈ కోణం లో సెక్యులర్ అన్న పదం ఉండటం లో అర్థం లేదు. 

5. 42 వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు : ఇది కేవలం దేశం లోని కీలక judiciary , administration execution functions లో న్యాయవ్యవస్థను సర్వనాశనం చెయ్యటానికి చేసిన అత్యంత వివాదాదస్పదమైన ప్రమాదకరమైన సవరణ . ఇది దేశ విధి విధానాలను నాశనం చేసే నియంతృత్వ సవరణ . కోర్టుల అధికారాన్ని కాలరాసే సవరణ ఇది. ఇది ప్రజామోదాన్ని పొందలేదు. అధికారంలో వున్న పార్టీ తన నిరంకుశత్వంతో సర్వ సత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర లో దేన్నయినా నాశనం చెయ్యొచ్చు. ఈ సవరణ సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలను preamble లో చేర్చింది .ఈ పదాలు ఏవిధంగా చెల్లవో పైన వివిధ కోణాల్లో తెలియజేశాను. కాబట్టి ఎలా చూసినా కూడా రాజ్యాంగం లో సెక్యులర్ అన్న పదం ఉండటం లో అర్ధం లేదు