5 రోజులు తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు


గురువారం నుంచి జనవరి 1 వరకు శ్రీవారికి అన్ని ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. ఇంకా బాధాకరం ఏమిటంటే తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ, వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసింది. కాగా అశేషంగా తరలివచ్చే భక్తులకు అన్నపానీయాలు ముమ్మరంగా వితరణ చేయడానికి ఏర్పాట్లు చేసినట్టు తితిదే అధికారులు చెబుతున్నారు. క్యూలైన్లలో దాదాపు 30 గంటల పాటు స్వామి దర్శనానికి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ముఖ్యాంశాలు