జాతి వ్యతిరేక మీడియాకి పట్టని మహాద్భుత ఘటన!


అవును ఇది నిజంగానే ఒక మహాద్భుత సన్నివేశం. కానీ మన దేశంలోని జాతీయ వ్యతిరేక మీడియాకి, మెజారిటీలైన హిందువులకి వ్యతిరేకంగా పని చేస్తున్న మీడియాకి ఇదేమాత్రం వార్త కూడా కాదు. నలభై లక్షలమంది కేరళ హిందువుల చోటు చేసుకున్న ఓ మహా సంఘటన ఇది. శబరిమలైలోని స్వామి అయ్యప్ప ఆలయానికి సాంప్రదాయ విరుద్ధంగా ఏ వయసు మహిళలైన వెళ్లవచ్చంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు ఇక్కడ చిచ్చు రేపింది. దశలవారీ ఆందోళనలో భాగంగా ఇపుడు కేరళ అంతటా శరణు ఘోష మార్మోగింది. దీపాలతో దేదీప్యమానంగా కేరళ రహదారులు వెలిగిపోయాయి. అయ్యప్పజ్యోతి పేరిట ఆదివారం ఈ వినూత్న ఆందోళన జరిగింది. హాసంగడి నుంచి పారసాల వరకు రహదార్లు జ్యోతులు పట్టుకున్న భక్తులతో నిండిపోయాయి. శబరిమలై కర్మ సమితి, హిందూ ఐక్యవేది, విశ్వహిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అరుపులు లేవు . కేకలు పెడబొబ్బలు లేవు . బస్సులు తగల పెట్టడం , రైల్ రోకోలు ఇలాంటి ఉద్రిక్తతలేమీ లేవు. చిన్న అవాంఛనీయ సంఘటన కూడా లేదు. ఒకటి కాదు రెండు కాదు 795 కిలోమీటర్ల పొడుగున మానవ దీప హారం ఏర్పడింది. రోడ్లమీదే విచ్చలవిడిగా ముద్దులు పెట్టుకునే నాస్తిక మూకలని ఎగబడి చూపించే మీడియా, తాళి తెంపుకొనే తంతులని ఆర్తిగా చూపించే సాంప్రదాయ వ్యతిరేక మీడియా ఇంత పెద్ద హైందవ సంఘటనని మాత్రం పూర్తిగా పక్కన పెట్టింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం