అఫ్గాన్‌లో మరో దారుణం.. 95  మంది మృతి


అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదుల దారుణాలు కొనసాగుతున్నాయి. ప్రాణాలు కాపాడటానికి ఉపయోగించే అంబులెన్స్‌ వాహనాలను ధ్వంస రచనకు వాడుకున్నారు. పేలుడు పదార్థాలు నిండిన ఒక అంబులెన్స్‌ను రాజధాని కాబూల్‌లో రద్దీ ప్రాంతంలో పేల్చి 95 మంది చావుకి కారణమయ్యారు. మరో 158 మంది ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ నగరంలో జరిగిన అతిపెద్ద బాంబు దాడుల్లో ఇదొకటి. వారం వ్యవధిలో జరిగిన రెండో ఘాతుకమిది. ఈ దాడికి తామే కారణమని తాలిబన్‌ ముష్కర ముఠా ప్రకటించింది. ఆత్మాహుతి బాంబర్‌ ఒక చెక్‌పోస్ట్‌ను దాటి మరీ వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రెండో చెక్‌పోస్ట్‌ వద్ద సిబ్బంది పేలుడు పదార్థాల్ని కనిపెట్టారు కానీ... అతడు పేల్చకుండా ఆపలేకపోయారు. భారీ పేలుడు తీవ్రతకు సమీపంలోని వారంతా ఎగిరి రక్తం ముద్దల్లా పడిపోయారు. తమ వీపులపై మోసుకుంటూ పలువు రిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పేలుడు తీవ్రతకు దగ్గర్లోని నిర్మాణాలు కుప్పకూలాయి. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనాలూ కంపించిపోయాయి. బాంబుదాడి కోసం అంబులెన్స్‌లను ఉపయోగించ డాన్ని అఫ్గాని స్థాన్‌ అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ కమిటీ ఖండించింది.

ముఖ్యాంశాలు