వన్యప్రాణుల కోసం అడవుల్లో నీటి చెలమలు


వేసవి ఎండల ధాటికి నీటికి ఎంత కటకట ఏర్పడుతుందో మనకు తెలిసిన సంగతే. నగరాలు, పల్లెల్లోనే కాదు, అరణ్యాలలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మనుషుల్లాగే జంతువులు, పక్షులు కూడా దాహార్తితో గుక్కెడు నీటికోసం వెదుకులాడతాయి. అరణ్యాల్లోని కొండవాగులు, నీటిఊటలు అన్నీ ఎండకు అడుగంటిపోయిన పరిస్థితుల్లో వాటి దాహం తీరేదెలా? అందుకే మండువేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చడం కోసం అటవీశాఖ అధికారులు అరణ్యాల్లో నీటి గుంతలను తవ్విస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు రేంజ్‌ పరిధిలో తాజాగా ఆరు నీటి గుంతల్ని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అటవీశాఖ తవ్వించింది. కుందూరు సెక్షన్‌ పరిధిలోని తెల్లవారి గూడెం బీట్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోని లోతట్టు అటవీభూముల్లో ఈ గుంతలను తవ్వించారు. గుంతకు గుంతకు మధ్య సుమారు కిలోమీటర్‌ దూరం ఉండేలా మొత్తం ఆరు నీటి గుంతలను తవ్వించామని రేంజ్‌ ఆఫీసర్‌ మడకం అబ్బాయిదొర తెలిపారు. పాపికొండ జాతీయవనాన్ని ఆనుకుని ఉన్న ఈ అటవీ ప్రాంతం ఎలుగుబంట్లు, దుప్పులు, నక్కలు, అడవి గొర్రెలు, గొర్ర గేదెలు వంటి వన్యప్రాణులకు ఆలవాలం. త్లెవారిగూడెం ఏరియాలో హంసవాగు, గిన్నె తోగు వాగు పారేవి. అయితే గత సెప్టెంబర్‌ నుంచే వీటిలో నీరు నిండుకుంది. దీంతో ఇక్కడి జంతుజాలానికి తాగేందుకు తగినన్ని నీళ్ళు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే ఇలా ఉంటే వేసవి ఎండలు ముదిరితే పరిస్థితి మరింత విషమిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అటవీశాఖ నీటి గుంతలను తవ్వే కార్యక్రమం చేపట్టిందని చింతూరు డిఎఫ్‌ఓ శ్రీనివాస్‌ వెల్లడించారు. ఇవి నీళ్ళు ఊరే గుంతలు కావడంచేత నీటి చెలమలుగా పేర్కొనవచ్చని... ఇలాంటి చెలమల తవ్వకం వలన సహజసిద్ధంగా నీరు చేరుతూ జంతుజాలం అవసరాలు తీరగవలని ఆయన అన్నారు. అయితే సహజసిద్ధంగా నీరు ఊరే ప్రాంతాను గుర్తించడం కోసం రేంజ్‌ ఆఫీసర్‌ అబ్బాయిదొర స్థానిక గిరిజను, సిబ్బందితో కలసి దట్టమైన అటవీ ప్రాంతంలో వివిధ చోట్ల శాంపిల్‌ తవ్వకాలు జరిపించారు. తునికి పండ్లు, అడవి సపోటాలను తినేందుకు ఎుగుబంట్లు ఈ సీజన్‌లో అటవీ, మైదాన ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రదేశాల ఎంపిక, గుంతల తవ్వకం జరిపే సిబ్బందికి ఎలుగుల సంచారం ఇబ్బందికరంగా పరిణమించింది. అయినప్పటికీ జాగరూకతతో సంచరిస్తూ కొన్ని ప్రదేశాల్లో శాంపిల్‌ తవ్వకాలు నిర్వహించి నీటి ఊటలు ఉన్న ప్రాంతాలను వారు గుర్తించారు. 5 అడుగుల వెడల్పు, 5 అడుగుల పొడవు ఉన్న చతురస్రాకార గుంతలను మీటరు లోతున తవ్వించగా వాటిలో సహజసిద్ధంగానే నీరు చేరింది. దీంతో ఇవి చిన్న జలాశయాల్లా కనిపిస్తున్నాయి. ఒక్కో నీటిగుంతకు సుమారు మూడువేల రూపాయలు ఖర్చయిందని రేంజ్‌ అధికారి వ్లెడిరచారు. ప్రకృతిపైన, అందులోని జీవవైవిధ్యంపైన మానవజీవితం ఆధారపడి ఉందని, అందుకే ప్రకృతిలోని ఇతర జంతుజాలాన్ని పరిరక్షించేందుకు ఇటువంటి చర్యలు తీసుకోవడం మన బాధ్యత అని రాజమండ్రి సర్కిల్ అటవీ ముఖ్య సంరక్షణాధికారి జెఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. అవసరమున్న ప్రాంతాల్ని గుర్తించి ఇటువంటి చెలమలను, నీటి గుంతలను తవ్వించడం ద్వారా వన్యప్రాణుల దాహార్తి తీర్చే చర్యలు చేపట్టాలని ఆయన సిబ్బందికి సూచించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం