దుర్గమ్మ గుడికి రూ. 11.06 కోట్ల ఆదాయం

దసరా ఉత్సవాల్లో కనకదుర్గమ్మ ఆలయానికి హుండీ, దర్శనం టిక్కెట్టు, ప్రసాదాల విక్రయాల రూపేణా మొత్తం 11.06 కోట్లు ఆదాయం వచ్చిం దని కార్యనిర్వహణాధికారిణి కోటేశ్వరమ్మ తెలిపారు. హుండీ ఆదాయం 5.88 కోట్లు, ఇతర సేవలు, ప్రసాదాల ద్వారా 5.17 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కాగా దసరా ఏర్పాట్లకు 8.40 కోట్లు ఖర్చుపెట్టామని చెప్పారు. శాశ్వత ప్రసాదాల పోటు, అన్నప్రసాద కేంద్రం నిర్మించేం దుకు ఉన్నతాధికారులు, పాలకమండలి సభ్యుల సహకారంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు  వెల్లడించారు. ఉత్సవాల్లో 2.32 లక్షల మందికి అన్నప్రసాదాన్ని, 7.86 లక్షల మందికి అప్పం, 8.50 లక్షల మందికి కుంకుమ ప్రసాదాన్ని పంపిణీ చేసినట్లు వెల్లడించారు. 

Facebook
Twitter