జగన్ పై దాడి కేసులో దర్యాప్తు


జగన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాసరావును సిట్ పలు కోణాల్లో విచారిస్తోంది. నవంబర్ 2 వరకు ఈ విచారణ కొనసాగనుంది. అతని కుటుంబసభ్యులు, బంధువులతో సిట్ అధికారులు మాట్లాడారు. లేఖ రాసిన యువతి, మరో యువతితోపాటు తాజాగా ఇంకో మహిళను సిట్ పోలీసులు ప్రశ్నించారు. గత ఏడాది కాలంలో శ్రీనివాసరావు 9 ఫోన్లు మార్చాడనేది కీలకాంశంగా మారింది. వాటిని కొనడానికి అవసరమైన నగదు ఎలా వచ్చింది? అతని ఆర్థిక వనరులు ఏంటి? అతనికి ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి? ఆర్థిక పరిస్థితి ఎలావుందీ? తదితర అంశాలపై సిట్ పోలీసులు ఆరా తీశారు. వెలది ఫోన్ కాల్స్ ను అతడు మాట్లాడడం మరో ముఖ్యాంశం. ఎక్కువసార్లు ఎవరితో మాట్లాడాడు? గత ఆరు నెలల్లో అతను ఎవరెవరిని కలిశాడు? ఏయే ప్రాంతాలకు ఎందుకు వెళ్లాడు? అనే అంశాలపై దృష్టి పెట్టింది. శ్రీనివాసరావు రాయగలిగినా ఇతరులతో లేఖ ఎందుకు రాయించాడు ? విమానాశ్రయంలో భద్రతా లోపాలను అతను ఏ విధంగా ఉపయోగించుకున్నాడు? ఘటన తర్వాత కత్తిని విమానాశ్రయం నుంచి బయటకు తీసుకువెళ్లినవారు ఎవరు? మళ్లీ లోపలి ఎలా తెచ్చారు? ఇలాంటివన్నీ ప్రశ్నలుగా మారాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం