పోలవరాన్ని శాపంగామార్చుకుంటున్న బిజెపి

పోలవరం తుది అంచనా వ్యయం రూ.57,940.86 కోట్లకు త్వరలోనే ఆమోద ముద్ర వేసేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెబుతున్నారు. వచ్చేవారం పది రోజుల్లో టీఏసీ మీటింగ్ పెట్టి ఆమోదప్రకటన చేస్తారని సమాచారం. ఇది నిజమైతే మంచిదే .. కానీ ఈ సందర్భంగా సొమ్మూ పోయి దుమ్మూ పెట్టిందనే సామెత /డైలాగ్ మనందరికీ తప్పకుండా గుర్తొస్తుంది. ఎలాగూ రాష్ట్రప్రభుత్వం అడిగిన మొత్తం అంతా ఇచ్చేటప్పుడు రాయల్ గా అప్పుడే ఇచ్చి..ఎంచక్కగా కేంద్రమే దగ్గరుండి పోలవరం ప్రాజెక్టుని కట్టిస్తే ఆ గొప్ప వారికే ఉండేది కదా! మధ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ముఠా మేస్త్రీగా పెట్టుకోవడం ఎందుకు, నిధులు అడిగినప్పుడు కొర్రీలు వేయడం ఎందుకు? కాంట్రాక్టర్ మార్పు విషయంలో సిగపట్లెందుకు? అవినీతి జరిగిపోయిందని, నిధులు మళ్లించేశారని నానా యాగీచేయడం ఎందుకు?  ఇంతింత జాప్యం చేసి అందరిచేతా కేంద్రప్రభుత్వం బూతులు తిట్టించుకోవడం ఎందుకు, ఇప్పుడేమో ఈ ఆఖరి క్షణాల్లో వారి చేతుల్లోనే అడిగినంత డబ్బూ పొయ్యడం ఎందుకు? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా ఉదయించక మానవు. 
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. చంద్రబాబు పవర్లోకి వచ్చాక పోలవరం అంచనా వ్యయం అంతకుముందు ఆరు మాసాల కిందటే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సవరించిన 16 వేలకోట్లనుంచి రెండు మూడు దశల్లో 58 వేలకోట్లకి పెరిగిపోయింది. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించారంటే అర్థం.. ఈ ప్రాజెక్టుని కేంద్రమే నిర్మించాలని! డబ్బంతా కేంద్రం ఇస్తానని చెప్పినప్పుడు కేంద్రమే నిర్మించవచ్చుగా.. కానీ అప్పట్లో జరిగిన ఓ సభలో అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గారు కేంద్రం నిధులిచ్చే ఈ ప్రాజెక్టుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణలో పెడుతున్నట్టు ప్రకటించారు. అదే బాబుకి క్షీరాభిషేకంగా మారింది. ఇక అక్కడినుంచి పోలవరాన్ని పూర్తిగాఆయన జేబు ప్రాజెక్టుగామార్చుకున్నచంద్రబాబు మూడంచెల వ్యూహం అమలు చేసారు. ఒకటి.. పోలవరం నిధుల్ని ఇష్టారాజ్యంగా దారి మళ్లించి వాడుకోవడం, రెండు... డబ్బులే ఇవ్వలేదంటూ  కేంద్రాన్ని దుమ్మెత్తి పోయడం, మూడు ... పోలవరం ప్రాజెక్టుని తానే చెమటోడ్చి, తన సొంత సొమ్ముతో కట్టేస్తున్నట్టు బిల్డప్పులు, ర్యాంప్ వాకులతో జనాన్ని అయోమయంలో ముంచెత్తడం..! ఈ మూడు పనుల్నీ బాబు పక్కాగా అమలు చేసారు. రాష్ట్రప్రజల అమాయకత్వం, ఇక్కడి ఇతరపార్టీల అవగాహన రాహిత్యం ఆసరాగా బాబు ఈ రెండేళ్లలో కేంద్రాన్ని ఎంత బాడ్ చేయాలో అంతా చేసారు. ఇప్పుడు.. ఇంతా జరిగాక...  నిధులు ఇవ్వడం ప్రాజెక్టుకి ఎంతమేరకు ఉపయోగపడతాయనేది పక్కనపెడితే బిజెపికి రాజకీయంగా ఉపయోగపడకపోగా... తెలుగుదేశానికి పూర్తిగా ఉపకరిస్తుంది. 2017 ఆగస్టు నుంచి రాష్ట్రాన్