చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 5 గురు మృతి


చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కె.జి సత్రం వద్ద బుధవారం రాత్రి టెంపో, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వెళ్తోన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు టెంపో ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. గాయపడ్డవారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు తిరుమల నుంచి మైసూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మహారాష్ట్రకు చెందినవారని, ప్రమాద సమయంలో టెంపోలో 18 మంది ఉన్నారని తెలిసింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం