హిందూ విశ్వవిద్యాలయం.. నవాబుగారి విరాళం!


మీరు ఈ కథ వినే ఉంటారు.. అయినా మళ్ళీ గుర్తు చేయడానికి సూటిగా సుత్తి వేయకుండా చెప్పేస్తాను. పండిత మదన మోహన మాలవ్యా గారు స్వాతంత్య్ర సమరయోధుడు, పండితుడు , న్యాయవాది కూడా.. వారు వారణాశి విశ్వ విద్యాలయం స్థాపించడానికి ఎందరో నవాబులను, సామాన్యుల నుండి విద్యాలయ స్థాపనకు ఏమాత్రం సంకోచించకుండా యాచించారు. ఆ ప్రయత్నములో అయన ప్రపంచములో అపుడు అతి ధనవతుడైన నైజాం నవాబు వద్దకు వెళ్ళి .. విద్యా సంస్థ స్థాపనకు వారి వంతు ఏమైనా సాయం చేయగలరేమో అని అర్థించారట. నైజాం నవాబు ఆయనను తీవ్రంగా దూషిస్తూ చిల్లిగవ్వ కూడా ఇవ్వనంటూ.. వెంటనే తన పాదరక్షలు తీసి ఆయన జోలెలో వేసారట. అయితే మాలవ్యా దీనికి చిన్నబుచ్చుకోలేదు. వాటిని మౌనంగా తనతో తీసుకు వెళ్లిన మాలవ్యా గారు సమయం చూసి ఆ పాదరక్షలు నైజాం నవాబు గారివని వేలం వేయడానికి సన్నాహాలు చేయగా గొప్ప ధర పలికింది.. ఆ విషయం వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్న నైజాం నవాబు సిగ్గుపడి.. ఆ పాదరక్షలను తనే అత్యధిక ధరకు కొని తనవంతు సాయం చేసారుట. అలా ఆ రోజుల్లో వారణాశి విశ్వ విద్యాలయానికి అత్యంత ధనం విరాళంగా ఇచ్చినవారుగా నిజం నవాబు చరిత్రలో నిలబడిపోయారు. నవాబు తన చెప్పులు వేసినప్పుడు, పైసా ఇవ్వనని తిరస్కరించినప్పుడు పండిత మాలవ్య చిన్నబుచ్చుకుని ఆ చెప్పులు అక్కడే పడవేసి ఉండి ఉంటే కథ వేరేలా ఉండేదేమో.!

- వీర నరసింహ రాజు, Kuwait City

ముఖ్యాంశాలు