దక్షిణాఫ్రికాను గెలిచిన సమోసా!

దక్షిణాఫ్రికాలో చిరుతిండి వంటకాల పోటీ .. అందులో కశ్మీరీ చిల్లీ చికెన్‌తో చేసిన భారతీయ సమోసా విజేత! దక్షిణాఫ్రికాలో భారత కమ్యూనిటీ కోసం వీక్లీ పోస్ట్ మీడియా సంస్థ ఇటీవల చిరుతిళ్ల పోటీ పెట్టింది. ఇందులో ఛాక్లెట్, జీడిపప్పు వంటకాలు, పిజ్జాలు ఇవన్నీ ఓడిపోగా... కశ్మీరీ చిల్లీ చికెన్ సమోసా తొలి స్థానంలో నిలిచి గెలిచింది. సల్మా అగ్జే అనే మహిళ ఈ సమోసాను తయారుచేశారు. దీంతో పాటు మరో రెండు పోటీలను కూడా నిర్వహించారు. వేగంగా సమోసాలు తయారుచేసే పోటీలో 63ఏళ్ల రోక్సానా నసీమ్ విజేత కాగా.ఆమె 60 సెకండ్లలో 10 సమోసాలను తయారుచేశారు. వేగంగా సమోసాలు తినే పోటీలో ఇబ్రహీం బక్స్ ఒక్క నిమిషంలోనే ఆ 10సమోసాలను తినేశాడు.