రాజ్యసభలో కాంగ్రెస్ సముచిత ప్రకటన


గత కొన్నేళ్లలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఒక కీలక విషయంపై సముచితమైన ప్రకటన చేసింది. జాదవ్ తో అతడి భార్య, తల్లి భేటీ విషయంలో పాకిస్థాన్ అనుచిత, అమానుష ప్రవర్తనపై రాజ్యసభలో ఇవాళ విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ ప్రకటన చేసారు. ఈ ప్రకటనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ స్పందిస్తూ ప్రభుత్వానికి బాసట తెలిపారు. ‘జాదవ్‌ భార్య, తల్లిని పాక్‌ అవమానించడం అంటే మొత్తం భారతీయులనే అవమానించినట్లు" అని ఆయన అన్నారు. రాజకీయ విభేదాలకు అతీతంగా దీనిపై అందరం పోరాడాలని పిలుపునిచ్చారు. మన తల్లులు, సోదరీమణుల పట్ల వేరే దేశం చెడుగా ప్రవర్తిస్తే దాన్ని ఎవరూ సహించరాదన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం