కాబూల్ లో ఉగ్రదాడి.. 40 మంది మరణం


ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ ఉగ్రదాడి జరిగింది. నగరంలోని సాంస్కృతిక కేంద్రంవద్ద గురువారం జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో సుమారు 40 మంది చనిపోయినట్లు ఆఫ్గాన్‌ హోంశాఖ వెల్లడించింది. 30 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో విలేకరులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు. వెంటవెంటనే రెండు పేలుళ్లు సంభవించాయని, ఇక్కడికి సమీపంలో ఆఫ్గాన్‌ వాయిస్‌ ఏజెన్సీ లక్ష్యంగా ఈ దాడికి పాల్పడి ఉంటారని హోంశాఖ అధికార ప్రతినిధి నజీబ్‌ దానిశ్‌ తెలిపారు. నగరంలో ఇతర ప్రాతాల్లో కూడా బాంబు దాడులు కొనసాగవచ్చని అనుమానిస్తున్నారు. కాగా ఈ దాడి చేసింది తాము కాదని తాలిబన్‌ వెల్లడించింది. ఆఫ్గాన్‌లో తాలిబన్‌ ఉగ్రవాదుల ప్రమేయంతో దాడులు జరగడం పరిపాటి. అయితే ఈ తాజా ఘటనకు తాము బాధ్యులం కాదని తాలిబన్‌ చెప్పడంతో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యాంశాలు