నేరాలు జరగడానికి వీల్లేదు : చంద్రబాబు


భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు జరగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తుళ్లూరులో ఏపీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి ఆయన గురువారం భూమిపూజ చేశారు. నేరం అనేది ఏ రూపంలో అయినా అది పోలీసు, ప్రభుత్వం ఉదాసీనత వల్లనే జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తప్పు చేసినా న్యాయస్థానాల్లో ఏదో రకంగా తప్పించుకోవచ్చని ఇవాళ చాలా మంది అనుకుంటున్నా రని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నేరాలకు తగిన ఆధారాల సేకరణకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సమర్థంగా పనిచేయాలని, తప్పు చేయకుండా, తప్పు చేసిన వారు తప్పించుకోకుండా చేయాలని సూచించారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు ఈ ఫోరెన్సిక్‌ ల్యాబ్ లో ఉండాలని పేర్కొన్నారు. అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే వూపందుకున్నాయని చంద్రబాబు తెలిపారు. రూ.400 కోట్ల వ్యయంతో ఈ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్మిస్తున్నట్లు డీజీపీ సాంబశివరావు తెలిపారు. మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు