ట్రిపుల్ తలాక్ బిల్లు మహిళల రక్షణకే!


మూడు సార్లు తలాక్‌ చెప్పి ముస్లిం మహిళలకు విడాకుల ఇచ్చే అనాగరిక పద్ధతిని కట్టడి చేసేందుకు ఉద్దేశించిన ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు’ను కేంద్రం గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ సందర్భంగా హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని, చట్టపరంగా పొందిక లేదని వ్యాఖ్యానించారు. ఆయనకు బీజేడీ ఎంపీ బర్తృహరి మహతబ్‌ మద్దతు తెలిపారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వీటికి సమాధానాలిస్తూ ఇది ముస్లిం మహిళల హక్కులను పరిరక్షిస్తుందే తప్ప ఏ మతానికి, ఆచారానికి వైరుధ్యం కాదని పేర్కొన్నారు. నేరుగా, రాత రూపేణా, లేదా ఎలక్ట్రానిక్‌ విధానంలో ముమ్మార్‌ తలాక్‌ చెప్పడాన్ని నేరంగాను, చెల్లనిదిగాను పరిగణిస్తూ కేంద్రం ఈ బిల్లును రూపొందించింది. అలా చెప్పిన భర్తలకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించడానికి కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, జీవన భృతి కోరడానికి,మైనర్ పిల్లల సంరక్షణకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం