తమిళనాట దినకరన్ కలకలం


టీటీవీ దినకరన్‌కు మద్దతుగా నిలిచిన నేతలు పలువురిపై అన్నాడీఎంకే వేటు వేసింది. దినకరన్ మద్దతుదారులుగా పేర్కొంటూ 44 మంది పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం గురువారం ప్రకటించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని వారి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ, పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. వేటు పడిన వారిలో మధురై మాజీ ఎమ్మెల్యే ఆర్‌.సామి కూడా ఉన్నారు. దినకరన్‌ మద్దతుదారులకు ఇక నుంచి పార్టీలోని ఏ హోదాలోను కొనసాగే అవకాశం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో స్వత్రంత్య అభ్యర్థి దినకరన్‌ ఘన విజయం వెనుక మద్దతుగా నిలిచిన తొమ్మిది మందిని మంగళవారమే పార్టీ నుంచి బహిష్కరించారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ చర్య తీసుకున్నారు.

ముఖ్యాంశాలు