గుంటూరు జిల్లాలో ఘోరం.. ఐదుగురి దుర్మరణం


గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద గురువారం ఉద‌యం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా ముగ్గురు తీవ్రగాయాలతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో నలుగురు పదో తరగతి విద్యార్థులు. ప్రత్యేక తరగతుల కోసం వీరంతా ఆటోలో పాఠశాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు ఆటోని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఫిరంగిపురం మండలం వేమవరానికి చెందిన విద్యార్థినులు గాయత్రి, రేణుక, శైలజ, ఆటో డ్రైవర్ ధనరాజ్ ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరో విద్యార్థి కార్తీక్ రెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. తీవ్రంగా గాయపడిన వైష్ణవి, భాను, శిరీష లను ఆస్పత్రికి తరలించారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఆస్ప‌త్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. .

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం