ఆర్ కామ్ ఆస్తులను కొంటున్న జియో

రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తుల కొనుగోలుకు గురువారం రిలయన్స్ జియో ఒప్పందం కుదుర్చుకుంది. సోదరుడి సంస్థల ఆస్తులను ముఖేశ్ అంబానీ కొనుగోలు చేస్తున్నారు. ఆర్కాంకు సంబంధించిన వైర్లెస్ స్పెక్ట్రం, టవర్స్, ఫైబర్, మల్టీ ఛానెల్ నెట్వర్క్(ఎంసీఎన్ఎస్) లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చేతికి మారను న్నాయి. వెళ్లనున్నాయి. ఆర్కాంకు చెందిన 4జీ స్పెక్ట్రం, 43వేల టవర్స్ ఇక జియో అధీనంలో ఉంటాయి. ఈ లావాదేవీలు వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చిలోపు పూర్తయేలా ప్రణాళికలు రూపొందించారు. అక్టోబరు నాటికి ఆర్కాంకు రూ.45వేల కోట్ల రుణభారం ఉంది. దానిని తగ్గించుకునేందుకు ఆర్కాం ఆస్తులను అమ్మకానికి పెట్టింది. దీనిద్వారా ఆర్కాం తన రుణభారాన్ని రూ.6వేల కోట్లకు తగ్గించుకోవాలని భావిస్తున్నట్టు సంస్థ అధినేత అనిల్ అంబానీ చెప్పారు.