విశేష ఫలితాలనిచ్చే ముక్కోటి ఏకాదశి వ్రతం

December 28, 2017

ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వ దినం వైకుంఠ ఏకాదశి. 
దీనినే ‘ముక్కోటిఏకాదశి’ పేరుతో వైష్ణవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 
ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ పుణ్య దినాన ఆ దేవదేవుడ్ని వేయి కనులతో వీక్షించి, సేవించి, తరి౦చాలని పండితులు చెబుతున్నారు. 
ఇవాళ స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడం పుణ్యప్రదం. ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ చేయడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. నిజానికి ఏకాదశి తిథి విష్ణు స్వరూపమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నే ‘పుత్రద ఏకాదశి’ అని కూడా అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా అల్పాహారం, ప్హ్లాలాహారం శ్రేష్టం. .
శ్రీమహావిష్ణువుతో బాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. ఉత్తరాయణంలో దివంగతులైతే పుణ్యలోక ప్రాప్తి ఉంటుంది అనేది శాస్త్ర వచనం. మరి దక్షియణాయానంలో కన్నుమూసిన పుణ్యాత్ముల పరిస్థితి ఏమిటి? అటువంటి ఉత్తములు ఈ రోజున ఈ ఉత్తర వైకుంఠ ద్వార౦ ద్వారా ఉత్తమ లోకాలకు చేరుకుంటారు. 
ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళక ముందే భోజనం చేయాలి. 
దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. 
ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు.
అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. 
బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశి నుండి అన్నంలో వసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి రోజున ఉపవసించిన భక్తులకు లభిస్తుంది. అంతే కాదు ఇవాళ చేసిన ఏ పుణ్య కార్యమైనా ముక్కోటి రెట్లు హెచ్చు ఫలితాన్ని ఇచ్చి మనల్ని తరింప జేస్తుంది.
 

Facebook