భారీ వసూళ్లతో 2.ఓ రికార్డు


‘2.ఓ’ సినిమా భారీ వసూళ్లతో రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా దీని హవా నడుస్తోంది. ఈ సినిమా మొత్తం రూ.700 కోట్లు (100 మిలియన్‌ డాలర్లు) వసూళ్లు రాబట్టిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు.2018లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 53 సినిమాలు ఈ ఘనతను సాధించాయన్నారు. ఈ జాబితాలో భారత్‌ నుంచి ‘2.ఓ’, ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్స్‌’ చిత్రాలు చోటు దక్కించుకున్నాయని తెలిపారు. ‘2.ఓ’ లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరో. శంకర్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. అక్షయ్‌ కుమార్‌, అమీ జాక్సన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం. కాగా త్వరలో చైనాలోనూ ‘2.ఓ’ సినిమా విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది మేలో అక్కడ దాదాపు 56 వేల స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నట్లు ఈ చిత్రబృందం ప్రకటించింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం