పెట్టుబడుల అన్వేషణలో ఆంధ్ర మంత్రి లోకేష్


ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్య నియంత్రణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను పెద్దఎత్తున వినియో గిస్తామని ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న లోకేష్ లాస్ ఏంజెల్స్ లో ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో నిర్వహించారు. వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశాలు నిర్వహించారు. ఐటీ సంస్థలు ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చిన వివిధ పాలసీలను లోకేశ్ వారికి వివరించారు. సిస్ ఇంటెలి సిఈఓ రవి హనుమారతో ఆయన రాష్ట్రంలో పెట్టుబడుల విషయమై మాట్లాడారు. రవి స్పందిస్తూ.. తక్షణం 100 మంది ఉద్యోగులతో కూడిన బ్రాంచ్ ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభిస్తామని, రెండేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అడ్వాన్స్ బ్యాటరీ సిస్టమ్స్ కంపెనీ సిఈఓ రిచర్డ్ కెయిన్, వైస్ ప్రెసిడెంట్ మైక్ పాలో మీరాతో లోకేశ్ సమావేశమయ్యారు. లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో ఉన్న అడ్వాన్స్ బ్యాటరీ సిస్టమ్స్ తయారీ రంగాన్ని , ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం పెంచడానికి రూపొందించిన నూతన పాలసీలను విశదపరిచారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సాఫ్ట్ హెచ్క్యూ సిఈఓ క్రాంతి పొన్నం తో మంత్రి లోకేశ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఈ-ప్రగతితో పాటు బ్లాక్ చైన్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ ఫిన్ టెక్ లాంటి అధునాతన సాంకేతికతలను ప్రోత్సహిస్తున్న తీరును లోకేశ్ వారికి వివరించారు.

ముఖ్యాంశాలు