కాపు రిజర్వేషన్లపై ప్రైవేట్‌ బిల్లు


కాపు రిజర్వేషన్లపై రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రైవేట్‌ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల విషయమై జనవరి 18న పార్లమెంట్‌కు లేఖ రాశానని, ఆ మేరకు లోక్‌సభలో బిల్లు పెట్టడానికి అనుమతి మంజూరైనట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదయాత్ర సమయంలో నే కాపుల కష్టాలను చూసి బీసీలకు నష్టం లేకుండా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆయన అన్నట్లే కమిషన్‌ వేసి నివేదిక వచ్చిన 48 గంటల్లోనే అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసిన ఘనత ముఖ్యమంత్రికే చెందుతుందన్నారు. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కోరుతూ లోక్‌సభలో పెడుతున్న ఈ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం వైకాపాతో పాటు అన్ని పార్టీల నాయకుల్ని కలిసి కాపుల పరిస్థితిని వివరిస్తామన్నారు.

ముఖ్యాంశాలు