వెయ్యి కిలోమీటర్ల మైలురాయి చేరిన జగన్ పాదయాత్ర


ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, గ్రామస్థులు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సైదా పురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘వాక్‌ విత్‌ జగన్‌’ కార్యక్రమాల్లో పలువురు పాల్గొన్నారు. గత ఏడాది నవంబర్‌ 6న ఇడుపులపాయ వైఎస్‌ఆర్‌ ఘాట్‌ నుంచి వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు.

ముఖ్యాంశాలు