ఫారెస్ట్ అకాడమీ ట్రెయినీల స్టడీ టూర్ ప్రారంభం


దివాన్ చెరువు గ్రామంలోని ఎపి స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న వివిధ జిల్లాల బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు 59 మంది ఆదివారం అధ్యయన యాత్రకు తరలివెళ్లారు. ఫిబ్రవరి 8 వ తేదీ వరకు రెండువారాల పాటు జరిగే ఈ స్టడీ టూర్ లో భాగంగా వారు కోరంగి, ఏటికొప్పాక, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ (విశాఖపట్నం), అరకు, బొర్రా గుహలు, అనంతగిరి, పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, జోలాపుట్, బొండ్రుగూడ, పాడేరు, మినుములూరు కాఫీ తోటలు, సీలేరు, ఆర్వీ నగర్, వలసగెడ్డ, చింతూరు, మోతుగూడెం లాగింగ్ డివిజన్, ఐటిసి పేపర్ మిల్, లక్ష్మి పేట క్లోనల్ నర్సరీలు, ఎర్రగుంటపల్లి బాంబూ ప్లాంటేషన్స్, కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం, ఎపిఎఫ్ డిసి బాంబూ, యూకలిఫ్టస్ ప్లాంటేషన్స్ తదితర ప్రదేశాలను వారు సందర్శిస్తారు. ఆయా ప్రాంతాల్లో వాతావరణ, పర్యావరణ పరిస్థితులు, జీవ వైవిధ్యం, అటవీ స్వరూపాన్ని ప్రత్యక్షంగా పరికించడం కోసం వీలుగా ఈ అధ్యయన యాత్రని రూపకల్పన చేసారని డిప్యూటీ డైరెక్టర్లు వైఎస్ నాయుడు, ఎంవి ప్రసాదరావు తెలిపారు. సహజ వనరుల పరిరక్షణ అడవుల పరిరక్షణ, ప్లాంటేషన్స్ కు అనువైన స్థలాల ఎంపిక, నర్సరీల సక్రమ నిర్వహణ పద్ధతులను తెలుసుకుంటారన్నారు. వన్యప్రాణుల అలవాట్లు, జీవన విధానం పరిశీలన, మొక్కలు, చెట్ల గుర్తింపు, శాస్త్రీయ నామాలు, కుటుంబాల పరిజ్ఞానం, ఔషధ మొక్కల గురించి తెలుసుకోవడం, గిరిజన జీవన విధానాన్ని, ఎకో టూరిజం విధి విధానాలను ట్రెయినీలు పరిశీలించడం లక్ష్యంగా ఈ స్టడీ టూర్ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం