భాగల్పూర్ అల్లర్ల వెనుక బిజెపి - లాలూ


బిహార్‌లోని భాగల్పూర్‌‌లో అల్లర్లు చెలరేగడంపై ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లర్ల వెనుక భాజపా కుట్ర ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ పని ఇక అయిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. నాథ్‌నగర్ ‌పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మెదిని చౌక్‌ ముస్లిం ప్రభావిత ప్రాంతం. అయితే అక్కడ భాజపా, ఆరెస్సెస్‌, భజరంగ్‌ దళ్‌కార్యకర్తలు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించడంతో ఘర్షణలు చెలరేగాయి. దీన్ని ఉటంకిస్తూ లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నితీశ్ ‌పని ఇక అయిపోయినట్టే. బిహార్‌లో ఘర్షణలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో భాజపా చిచ్చు పెడుతోంది. అల్లర్లను ప్రోత్సహిస్తోంది. నన్ను జైలుకు పంపాక రాష్ట్రంలో మంటపెడుతోంది’’ అని ఆయన దిల్లీలోని రైల్వేస్టేషన్‌కు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం