ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం


ఇండోనేషియాలో 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న లయన్‌ ఎయిర్‌ విమానం సముద్రంలో కుప్పకూలింది. జకార్తా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది క్షణాలకే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఉదయం 6.20 గంటలకు జకార్తా విమానాశ్రయం నుంచి 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బందితో లయన్‌ ఎయిర్‌ విమానం సుమత్ర దీవుల్లోని పంగ్కల్‌ పినాంగ్‌కు బయల్దేరింది. టేకాఫ్‌ అయిన 13 నిమిషాలకే విమానానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానం కాసేపటికే జావా సముద్రంలో తీరానికి దగ్గరలోనే కూలినట్లు అధికారులు గుర్తించారు. తక్షణమే స్పందించిన అధికారులు విమానం కోసం గాలింపు చేపట్టారు. తీరానికి సమీపంలో విమాన శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించారు.

ముఖ్యాంశాలు