"సందేశార" అక్రమాలతో అహ్మద్ పటేల్ కి లింకు


మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఓ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వివిధ అవకతవకలపై ప్రశ్నిస్తుండగా అందులో అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్, అల్లుడు ఇర్ఫాన్ సిద్దిఖీ పేర్లు బయటపడ్డాయి. తీగ లాగితే డొంక కదిలిన రీతిగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అహ్మద్ పటేల్‌ అక్రమాలు వెలుగు చూస్తుండడం విశేషం. వివరాలు ఇలా ఉన్నాయి. సందేశార గ్రూప్‌‌పై మనీ లాండరింగ్‌ ఆరోపణలు రాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరుపుతోంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ సునీల్ యాదవ్‌ను ఈడీ ప్రశ్నించింది. సునీల్ ఇచ్చిన లిఖితపూర్వక సాక్ష్యంలో సందేశార గ్రూప్ యజమాని చేతన్ సందేశార, ఆయన సహచరుడు గగన్ ధావన్ భారీ మొత్తంలో సొమ్మును సిద్ధిఖీ అనే వ్యక్తికి ఇచ్చినట్లు, అలాగే చేతన్ సందేశార తరపున భారీ నగదును ఫైజల్ పటేల్‌కు పంపించినట్లు సాక్ష్యంలో తెలిపారు. న్యూఢిల్లీలోని 23,మదర్ క్రెసెంట్‌లో అహ్మద్ పటేల్ నివాసం ఉంది. ఇక్కడికి చేతన్ సందేశార తరచూ వెళ్ళేవాడు. ఈ బంగ్లా గురించి ప్రస్తావించినపుడల్లా ‘హెడ్‌క్వార్టర్స్ 23’ అని పేర్కొనేవారని ఈడీ తెలిపింది. సిద్ధిఖీని జే2 అని, ఫైజల్‌ను జే1 అని సంబోధించేవారని కూడా సాక్ష్యంలో తెలిపినట్టు ఈడీ వెల్లడించింది. సునీల్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం నమోదు చేయడం వల్ల దీనిని కోర్టులో అనుమతిస్తారని సంబంధిత వారలు తెలిపాయి. వర్గాలు తెలిపాయి. కాగా దీనిపై స్పందించేందుకు అహ్మద్ పటేల్ నిరాకరించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం