రాజ్యసభలో ఆ పధ్ధతి మార్చిన వెంకయ్య


రాజ్యసభలో పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు ఐ బెగ్‌, ఐ బెగ్గింగ్‌ అనే పదాలను వాడొద్దని రాజ్యసభ ఛైర్మన్‌ ఎం వెంకయ్యనాయుడు సభ్యులందరికీ మళ్ళీ గుర్తుచేశారు. శుక్రవారం కేంద్రమంత్రి పీపీ చౌదరి సభలో మాట్లాడుతూ ఐ బెగ్‌ అని పలకగా వెంటనే వెంకయ్య అడ్డుపడి, బెగ్‌ అనే పదాన్ని ఉపయోగించొద్దని సూచించారు. కేవలం పత్రాలను ప్రవేశపెడుతున్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించాలని సూచించారు.ఆ తర్వాత చౌదరి మాట్లాడేపుడు బెగ్‌ పదాన్ని వాడకపోవడంతో వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు కూడా వెంకయ్యనాయుడు ఈ సూచన చేయడం తెలిసిందే. రాజ్యసభలో పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు సభ్యులు ఐ బెగ్‌ టు అని పలకడం ఇంతవరకూ రివాజుగా నడిచేది. అయితే ఈ పదం వలసవాదానికి నిదర్శనమని, మనం స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నామని చెబుతూ వెంకయ్య నాయుడు ఈ పదాన్ని వాడొద్దని సూచించారు.

ముఖ్యాంశాలు