ప్రధానమంత్రిని కలసిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి


ప్రధాని నరేంద్ర మోదీని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలుసుకున్నారు. సుమారు అరగంటపాటు వారిద్దరూ మాట్లాడుకున్నారని సమాచారం. శుక్రవారం ఉదయం పార్లమెంట్ సమావేశాల టీ బ్రేక్ సమయంలో (11:30గంటలకు) ఈ ఎంపీ మోదీ చాంబర్‌కు వెళ్లి కలిశారు. ఏపీ రాజకీయాలపై ఆయన మోదీతో చర్చించారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత జగన్ మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న పాద యాత్ర’ గురించి సాయిరెడ్డి ఈ సమావేశంలో మోడీకి వివరించారని... అలాగే తెలుగుదేశం ప్రజా వ్యతిరేక పాలన గురించీ చెప్పుకొచ్చారని తెలియవచ్చింది.

ముఖ్యాంశాలు