ప్యాసింజర్ రైల్లో ముఖ్యమంత్రి ప్రయాణం

నిరాడంబరతకు మారుపేరైన గోవా ముఖ్యమంత్రి మనోహర్ ఫారికర్ తాజాగా ప్యాసింజర్ రైల్లో సాధారణ ప్రయాణికులతో కలసి ప్రయాణించారు. ఈ సంఘటన పూర్వాపరాలు.. ఈమధ్య ఆయన మడగాన్ (గోవా) నుంచి కుంట (కర్ణాటక) వెళ్లేందుకు రైలు స్టేషన్ కి వచ్చారు. అయితే ఆయన వెళ్లాల్సిన రైలు చాలా లేటు అని అధికారులు చెప్పారు. దీంతో ఆ తర్వాత ఉన్న మంగుళూరు ప్యాసింజర్ (56641) లో ప్రయాణించాలని ఆయన నిశ్చయించుకున్నారు. రైలుకు ప్రత్యేక బోగీ తగిలిస్తామని అధికారులు చెప్పిన ఆయన వద్దని.. అందరితో కలిసి ప్యాసింజర్ లోనే ప్రయాణించారు. దటీజ్ ఫారికర్! 

Facebook
Twitter