బ్రాహ్మణుల సంక్షేమానికి తెలుగుదేశం కృషి : గోరంట్ల


తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణుల సంక్షేమానికి, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడా నికి ఎంతో కృషి చేస్తున్నదని రూరల్‌ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి వేలాదిమంది నిరుపేద బ్రాహ్మణులకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా విద్యాభివృద్ధికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం సహకరిస్తున్నదన్నారు. తెలుగుదేశం పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర పార్టీ కార్యాయం వద్ద 3వ డివిజన్‌ వార్డు సభ్యుడు, బూత్‌ కమిటీ సభ్యునిగా ఉన్న కోలగంటి రమేష్‌ ను ఎమ్మెల్యే గోరంట్ల పార్టీ కండువా కప్పి సత్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షునిగా ఇటీవల నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ చేసిన సహాయాన్ని, వారి సంక్షేమానికి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘనేతలు పలువురు రమేష్‌ను అభినందించారు.

ముఖ్యాంశాలు