శ్రీవారి సేవలో కన్నా

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్మీనారాయణ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో ఆయన రెండ్రోజుల పాటు పర్యటించి కార్యకర్తలతో సమావేశం నిర్వహిం చనున్నారు.

Facebook
Twitter