జగన్ పై దాడి వెనుక తెదేపా


వైకాపా అధినేత జగన్‌పై జరిగిన దాడి తెదేపా కుట్రేనని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మంగళవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్ప డిన శ్రీనివాస్‌ కోటి రూపాయలతో భూమి కొనుగోలుకు బేరసారాలు చేసాడని ఆరోపించారు. సినీనటుడు శివాజీ పథకం ప్రకారమే అమెరికా కు పారిపోయాడని రోజా ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రుల తీరు హేయంగా ఉందని, రక్షణ కల్పించలేకపోగా దాడికి గురైన వారిపైనే వెటకారంగా మాట్లాడటం శోచనీయమన్నారు. దాడి జరిగిన గంటలోనే నిందితుడు జగన్‌ అభిమాని అని డీజీపీ చెప్పడం, ఫ్లెక్సీని విడుదల చేయడం వెనుక కుట్ర ఉందన్నారు.

ముఖ్యాంశాలు