అమెరికాలో భారతీయ దంపతుల మృతి

భారత్‌కు చెందిన దంపతులు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కాలిఫోర్నియాలోని ప్రముఖ యోసెమైట్‌ జాతీయ పార్కులో 800 అడుగుల ఎత్తైన కొండపై నుంచి వీరు లోయలో పడ్డట్లు వెలుగులోకి వచ్చింది. వీరిని విష్ణు విశ్వనాథ్‌ (29), మీనాక్షీ మూర్తి (30)గా గుర్తించారు. విశ్వనాథ్‌ ఇటీవలే సిస్కో సంస్థలో సిస్టమ్‌ ఇంజినీరుగా ఉద్యోగంలో చేరారు. వారిద్దరూ ఇటీవలే న్యూయార్క్‌ నుంచి శాన్‌జోస్‌ నగరానికి నివాసం మార్చారని శాన్‌ ఫ్రాన్సిస్‌కో క్రానికల్‌ పత్రిక వెల్లడించింది. ఘటన జరిగిన ఒక రోజు తర్వాత వీరి మృతదేహాలను టూరిస్టులు పర్యటకులు గుర్తించారు. మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. దంపతుల మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తూ పడిపోయారా, ఆత్మహత్యా..? లేక మరేదైనా ఘటనా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

Facebook
Twitter