జగన్ కి పోటీ చేసే అర్హత లేదు - ఆనందబాబు


ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు, అధికారులపై నమ్మకం లేదని చెబుతున్న ప్రతిపక్ష నేత జగన్‌కు ఈ రాష్ట్రంలో పోటీ చేసే హక్కు లేదని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాడి జరిగిన వెంటనే జగన్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి చికిత్స తీసుకోవాలని.. అలా కాకుండా ఆయన నవ్వుతూ విమానం ఎక్కి వెళ్లిపోవడమేంటని నిలదీశారు. కత్తి దాడి జరిగితే ఎవరైనా కంగారు పడతారని.. కానీ జగన్‌లో ఆందోళన కనిపించలేదన్నారు. దాడి జరిగి ఐదు రోజులైనా జగన్‌ స్పందించలేదని.. మీడియా ఎదుట మాట్లాడితే నిజాలు బయటపడతా యని కంగారు పడుతున్నారని అన్నారు. జగన్‌ 3వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసినప్పుడు ఆయన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ భద్రత కల్పించింది ఏపీ పోలీసులేనని మంత్రి గుర్తుచేశారు. సీబీఐని కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అని విమర్శించిన వైకాపా నేతలు.. జగన్‌పై దాడి ఘటనను ఆ సంస్థతోనే విచారణ జరిపించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. పాదయాత్రలో ప్రజాదరణ లేకపోవడంతో వైకాపాలో ఆందోళన తలెత్తి అసత్య ప్రచారం మొదలెటారని మండిపడ్డారు.

ముఖ్యాంశాలు