జాతి నేతకు జోతలివే


ఇది నాకు తెలిసిన చరిత్ర... భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చారా బ్రిటిష్ వాళ్ళు?! ఇది పరమ బూతు మాట! పోతూ పోతూ.. దేశాన్ని మతం ప్రాతిపదికన రెండుగా చీల్చి పారేశారు... అక్కడితో వాళ్ళ కక్ష ఆగలేదు.. ఐదొందల పైచిలుకు సంస్థానాలు..చిన్న చిన్న సామ్రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని చీలికలు పీలికలు చేసి పారేయాలని కుట్ర పన్నారు. మీ ఇష్టం హిందుస్థాన్ లో ఉంటారో... పాకిస్థాన్ లో కలుస్తారో ... అని సంస్థానాధీశులకి చెప్పి మరీ పోయారు. ఆరోజు ఐదొందలపైచిలుకు సంస్థానాల్ని హ్యాండిల్ చేసి భారత్ లోకలిసేలా చేసిన ఉక్కుమనిషి సర్దార్ పటేల్... అదీ ఒకే సమావేశంతో.. ఒకే ప్రసంగం తో... ఇది జరిగిన తర్వాత తోక ఝాడించాలని అనుకున్న నిజాం కి ఎలాబుద్ధి చెప్పారో తెలిసిందే. ఆనాడే కాశ్మీర్ సమస్యని కూడా నిబద్ధత, దేశభక్తి మెండుగా ఉన్న సర్దార్ పటేల్ కి అప్పజెప్పి ఉంటే.. ఇవాళ పరిస్థితి ఇలాఉండేది కాదు. ఆరోజు పటేల్ వంటి మనిషి, మహా నాయకుడు లేకపోతే ఇవాళ మనదేశం మధ్యలో ఐదొందల దేశాలు ఉండేవి. వీసాలు, పాస్ పోర్టులు జేబులో పెట్టుకునే తిరగవలసి వచ్చేది. అఖండభారతం ఖండఖండాలైపోయి ఉండేది. ఆ విపత్తుని తప్పించిన పటేల్ నిజంగానే భరతమాత ముద్దు బిడ్డ. చరిత్రలో అనేకమంది దేశభక్తులకి, ప్రజానాయకులకి పెను అన్యాయం జరిగింది. కొందరిని మాత్రమే జాతీయ నాయకులుగా, జాతి పెత్తందారులుగా చిత్రించి మహనీయులెందరికో తీరని అపచారం చేసారు. అలాంటి వారిలో పటేల్ కూడా ఉన్నారు. ఇప్పటికైనా ఆయన స్థాయికి, గొప్పతనానికి తగిన రీతిలో ఆయనకి గొప్ప స్మారకచిహ్నం ఏర్పాటు కావడం జాతి గర్వించాల్సిన విషయం. భారతీయులు ప్రతి రోజూ స్మరించుకోవలసిన నాయకుల్లో మన పటేల్ ఒకరు. ఆయన స్మృతికి ఘన నివాళులు.

ముఖ్యాంశాలు